ఎన్టీఆర్ తో మౌళి తీస్తేనే మౌళి కి గౌరవం ?

ఐఫా ఉత్సవం 2017 లో ప్రధాన ఆకర్షణ గా నిలిచాడు తారక్, ప్రోగ్రాం మొత్తానికీ సుపర్ కళ ని తీసుకొచ్చిన తారక్ మీడియా తో కూడా చాలా యాక్టివ్ గా కనిపించాడు. బాహుబలి కి సంబందించిన కత్తి అవీ పట్టుకుని ఫుల్ హడావిడి చేసాడు మనోడు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మొదట్లోనే రాజమౌళి తో చేసిన ఘనత ఉంది. రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే కేక అనే సందర్భాలు బోలెడు ఉన్నాయి. వరసగా స్టూడెంట్ నెంబర్ 1 , సింహాద్రి లతో ఇండస్ట్రీ హిట్ లు రాజమౌళి చేతుల మీద నుంచే దక్కాయి కూడా. ఆ తరవాత యమదొంగ , అది కూడా పరవాలేదు అనిపించే సినిమా. తరవాత కాలం లో ఎన్టీఆర్ బిజీ అయిపోయాడు రాజమౌళి బిజీ అయిపోయాడు .

బాహుబలి దెబ్బకి రాజమౌళి ఎంతో ఎత్తుకి వెళ్ళగా ఇప్పుడు మౌళి తరవాత సినిమా ఖచ్చితంగా ఎన్టీఆర్ తో చేస్తేనే బెటర్ అంటున్నారు అందరూ. ఎన్టీఆర్ నట జీవితం లో ఎన్నో గొప్ప పాత్రలు చేసాడు కానీ పౌరాణికం మీద అతనికి ఒక మంచి సినిమా పడలేదు. ఎన్టీఆర్ ఐఫా లో గ్రీన్ కార్పెట్ మీద బాహుబలి కోసం ఇచ్చిన పోజు లోనే ఆ కత్తి చటారం తో అడరగొట్టేసాడు .. ఆ లుక్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. రాజమౌళి ప్రభాస్ తరవాత ఎంచుకుంటే ఎన్టీఆర్ నే ఎంచుకోవాలి అంటున్నారు చాలామంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here