వరుణ్ తేజ్ తో జతకట్టనున్న రష్మిక..!

తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది నటి రష్మిక మందన. ‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది.. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి, మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడిప్పుడే బడా హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటోంది. సరిలేరు నీకెవ్వరులో మహేష్ బాబు సరసన నటించిన ఈ చిన్నది, తాజాగా ‘పుష్ప’తో అల్లు అర్జున్ సరసన నటిస్తోంది.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం రష్మిక మెగా హీరో వరుణ్ తేజ్ కు జోడిగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తొలుత బాలీవుడ్ ముద్దుగుమ్మ.. సాయి మంజ్రేకర్ ను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. అయితే ఇప్పుడు ఆమె స్థానంలో రష్మికను తీసుకోనున్నారని సమాచారం. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here