క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు కత్తిరించుకున్న రేణు..

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ..  సోషల్ ఆక్టివిటీ ల్లోనూ క్రియాశీలంగా ఉంటుంది నటి రేణు దేశాయ్. రచయితగా, దర్శకురాలిగా ఎంత బిజీగా ఉన్నాసరే… సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం రేణుకు అలవాటు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా, చేసిన ఓ పోస్ట్ రేణు మంచితనానికి ఉదాహరణగా నిలుస్తోంది.

సాధారణంగా క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి చికిత్సలో భాగంగా జుట్టును తొలగిస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని స్వచ్ఛంద సంస్థలు.. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా విగ్గులను తయారుచేస్తుంటారు. ఇందుకోసం కొందరు స్వచ్ఛందంగా తమ వెంట్రుకలను స్వచ్ఛంద సంస్థలకు అందిస్తుంటారు. తాజాగా ఇలా జుట్టు దానం చేసిన వారి జాబితాలోకి నటి రేణు దేశాయ్ కూడా చేరారు. ఆమె తన జట్టును దానం చేసినట్లుగా చెబుతూ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. క్యాన్సర్ బాధితుల కోసం రేణు చేసిన ఈ పనికి అందరూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

https://www.instagram.com/p/CE_2yyaBWC6/?hl=en

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here