రామ్ గోపాల్ వర్మ కి చుక్కలు చూపిస్తున్నాడు అతను ..

సమయం సందర్భం లేకుండా , ఎప్పుడూ నేగేటివిటీ ని విపరీతమా స్ప్రెడ్ చేసే రాం గోపాల్ వర్మ కి ఎంత పెద్ద వ్యతిరేకులు ఉన్నారో అంతే మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. వర్మ చెప్పిన ప్రతీ దాన్నీ సీరియస్ గా తీసుకోలేక పోయినా ఆయన సినిమాలని అయినా సీరియస్ గా తీసుకోవాలి మరి. ప్రస్తుతం ఆయన గత చిత్రం వంగవీటి తాలూకా తలనొప్పి ఇంకా వర్మకి తగ్గినట్టు కనపడ్డం లేదు. తన తండ్రిని ఒక రౌడీ గా చూపిస్తూ వర్మ ఈ సినిమా తీసాడు అనీ వెంటనే వర్మ మీద చర్య తీసుకోవాలి అంటూ వంగవీటి రాదా హై కోర్టుకు ఎక్కారు.

అసలు ‘వంగవీటి’ చిత్రం మొదలు పెట్టకముందు వర్మ తమని కలిశాడని.. మా కుటుంబానికి మచ్చ రాకుండా సినిమా తీస్తానని చెప్పి.. మేము వ్యక్తం చేసిన అనుమానాలను వర్మ ఏమి పట్టించుకోకుండా సినిమా తీసి రిలీజ్ చేశాడని ఆయన పిటీషన్ లో పేర్కొన్నాడు. ఆ సినిమా విడుదలచేసేటప్పుడు మేం అభ్యంతరం వ్యక్తం చేసినా వర్మ పట్టించుకోకుండా ‘వంగవీటి’ చిత్రాన్ని ఇష్టానుసారంగా విడుదల చేశాడని రాధా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అసలు వంగవీటి జీవిత కథను సినిమా తియ్యకుండా వేరేవారి కోసమో వర్మ ఈ సినిమా తీశాడని… ఆ సినిమా వాళ్ళకి ఫెవర్ గా ఉండబట్టే అవతలివాళ్ళు కిమ్మనకుండా ఉండిపోయారని ఎద్దేవా చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here