తమిళం లో సూపర్ స్టార్ టైం మొదలైంది .. ఫాన్స్ సంతోషం

తమిళనాట పాగా వెయ్యాలి అని హీరో మహేష్ బాబు ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. శ్రీమంతుడు తో అది ఎలాగైనా సాధ్యం చెయ్యాలి అనుకున్నాడు కానీ ఆ సినిమా ఇక్కడ హిట్ అయ్యి అక్కడ ఫట్ అయ్యింది. అతడి పరిచయం అక్కడ పర్ఫెక్ట్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్నా ఎందుకో కుదరడం లేదు.శంకర్ , మణిరత్నం లాంటివారు నుంచి గౌతమ్‌ మీనన్‌, లింగుస్వామి తదితర దర్శకులు అదే పనిగా మహేష్‌ని వెంటాడారు. చివరికి మురుగదాస్ తో స్పైడర్ సినిమా సెట్ చేసుకుని వస్తున్నాడు మహేశ్.

ఈ సినిమా కి స్పైడర్ అని పేరు పెట్టగా ఈ చిత్రం మహేష్ కెరీర్ కి పర్ఫెక్ట్ అని అంటున్నారు. ఇంతకంటే బెస్ట్ సినిమా తమిళం లో లాంచ్ అవ్వడానికి ఉండకపోవచ్చు మహేష్ కి.మురుగదాస్‌ కూడా తమిళనాడులో చాలా పెద్ద బ్రాండే. రమణ, గజిని, తుపాకి, కత్తి… ఇలా చాలా బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన దర్శకుడు.  సో ఇంతకంటే గొప్ప బ్రాండ్ తో మహేష్ వెళ్ళలేడు ఇదే సూపర్ టైం అనీ సూపర్ స్టార్ టైం తమిళం లో మొదలైంది అనీ అంటున్నారు ఫాన్స్ కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here