ఒక చేతిలో కర్ర… మరో చేతిలో పుస్తకం.

ఎప్పుడెప్పుడు తమ అభిమాన నటుడిని వెండితెరపై చూస్తామని వేయి కళ్లతో ఎదురుచూసిన పవన్ అభిమానుల కల నిజం చేస్తూ ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ వచ్చేసింది. ఈ పోస్టర్ లో పవన్ సూటులో లాయర్ గా కనిపించారు. ఒక చేతిలో క్రిమినల్ లా పుస్తకం పట్టుకొని…  మరో చేతిలో కర్రతో దర్శనమిచ్చిన పవన్, నేరస్తుల బరతంపట్టడానికి.. చట్టం ప్రకారం,  కుదరకపోతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికైనా సిద్దమని చెప్పకనే చెబుతున్నాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో  “స‌త్యమేవ జ‌య‌తే” అంటూ వస్తోన్న మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలిచింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ‘వ‌కీల్ సాబ్’ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర బ్యాన‌ర్స్ క్రియేష‌న్స్‌పై దిల్‌ రాజు, బోనీ కపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘పింక్‌’కు తెలుగు రీమేక్ గా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.

రాజకీయాల్లో కొన్నాళ్లు బిజీగా ఉన్న పవన్ ఇప్పుడు మళ్లీ వెండి తెరకు రీ ఎంట్రీ ఇవ్వనుండడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here