పవన్, క్రిష్ సినిమా అప్ డేట్ వచ్చేసింది..

ఏ సోషల్ మీడియా సైట్ లో చూసినా ఈ రోజంతా పవన్ మేనియానే కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భoగా అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు. ఇక పవన్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తో ఆయన అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతోంది. తాజాగా పవన్ హీరోగా తెరకెక్కనున్న 27వ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమా దర్శకుడు క్రిష్ స్వయంగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఫస్ట్ లుక్ లో ప‌వ‌న్ చేతికి క‌డియం, న‌డుముకి ఎర్ర‌ని కండువాతో ఉండడం సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఫస్ట్ లుక్ ను పోస్ట్ చేసిన క్రిష్… ‘ఈ సినిమా కోసం జరిగిన పదిహేను రోజుల‌ షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది.. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు  అందుకుంటుండాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చాడు.

 

పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో 15 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే కరోనా కారణంగా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నారు, మరో ముఖ్య పాత్రలో అనసూయ నటించనున్నట్లు సమాచారం. చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here