అందాల ‘నిధి’..

‘మున్నా మైఖేల్’ అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార నిధి అగర్వాల్. సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నిధి నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్’ శంకర్ తో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుందీ బ్యూటీ. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో ఒక్కో సినిమాలో నటిస్తోంది నిధి.

సినిమాలతో బిజీగా ఉండే నిధి అగర్వాల్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ చిన్నది తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఫోటోలు ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పింక్ కలర్ గౌనులో తలపై కీరిటం లాంటి రిబ్బన్ ను ధరించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ.. ‘ఎప్పుడు తలెత్తుకునే ఉండండి’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ను జోడించిందీ చిన్నది. ఇక ఈ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు నిధి అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here