నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. !

నందమూరి నట వారసుల్లో హరికృష్ణ ఒకరు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ మంచిపేరు సంపాదించుకున్న హరికృష్ణ 64వ జయంతి నేడు (బుధవారం). ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. హరికృష్ణ ఫొటోతో పాటు.. ‘ఈ అస్తిత్వం మీరు, వ్యక్తిత్వం మీరు,మొక్కవోని ధైర్యంతో కొనసాగే నేతృత్వం మీరు, ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే… మీ 64వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటూ మిస్ యూ నాన్న’ అంటూ ఎన్టీఆర్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టాడు.

నందమూరి హరికృష్ణ 2018 ఆగస్టు 29న నెల్లూరులో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుండగా నల్గొండలోని నార్కెట్ పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇక హరికృష్ణ సినిమాలతో పాటు రాజ్య సభ సభ్యుడిగా, టీడీపీ పార్టీకి ఎనలేని కృషి చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here