కనుమరుగైన కమెడియన్ వడివేలు, కారణం?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ బ్రహ్మానందం ఎంత ఫేమస్సో, కోలీవుడ్ ఇండస్ట్రీలో వ‌డివేలు అంత ఫేమస్. కమెడియన్ వ‌డివేలు కి హీరోలకు సమానంగా అభిమానులు ఉన్నారు. తెలుగులో కూడా వ‌డివేలు కి అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం వడివేలు సినిమాలకు చాలా దూరంగా ఉంటున్నాడు. సంవత్సరానికి 20 30 సినిమాలు చేసే వ‌డివేలు పూర్తిగా కెమెరాకి దూర‌మైపోవ‌డం వెన‌క చాలానే క‌థ న‌డిచింద‌ని చెబుతారు.

అప్ప‌ట్లో హీరో విజ‌య్‌కాంత్ పార్టీకి ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసిన వ‌డివేలు ప్ర‌త్య‌ర్థులైన క‌రుణానిధి వ‌ర్గీయుల్ని ప‌చ్చిగా తిట్ట‌డం.. ఆ త‌ర్వాత వ‌డివేలు ప్ర‌చారం చేసిన పార్టీ ఓడిపోవ‌డం.. ఆ క్ర‌మంలోనే అత‌డికి సినిమా అవ‌కాశాలు త‌గ్గిపోవ‌డం.. అంతా స్వ‌యంకృత‌మేన‌ని చెబుతారు. అయితే ప్రస్తుతం వడివేలు బిజినెస్ చేస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయ రంగానికి వెళ్లి హీరోలే కాకుండా కామిడియన్లు కూడా చేతులు కాల్చుకుంటున్నరు మరి ముందు ముందు ఇంకెంతమంది చేతులు కాల్చుకుంటారో రాజకీయ రంగం లో చూడాలి మరి.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here