పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి మహేష్ బాబు అక్క

సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అక్క మంజుల తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలు. గతంలో మంజుల నిర్మాత అనేక సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం మంజుల దర్శకురాలిగా తెలుగు ప్రేక్షకులను అలరించాలని చూస్తోంది. ఈ క్రమంలో సందీప్ కిషన్ హీరోగా అమైరా దస్తూర్ హీరోయిన్ గా మనసుకు నచ్చింది అనే సినిమాను డైరెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవడంతో సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టరు సినిమా యూనిట్.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో  పాల్గొన్నారు డైరెక్టర్ మంజుల హీరో సందీప్ కిషన్…ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ  “మా నాన్నగారు .. మహేశ్ తరువాత నేను ఎక్కువగా అభిమానించే వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయనలోని నిజాయతీ నాకు బాగా నచ్చుతుంది. ఆయన కోసం నేను ఒక కథ రాసుకున్నాను .. ఆ కథకి ‘పవన్’ అనే టైటిల్ ను కూడా పెట్టేశాను. నేను రాసిన కథ పవన్ వినాలే గానీ, ఆయనకి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది. ఒకసారి ఈ కథ వినమని మీరైనా చెప్పండి” అంటూ ఆమె మీడియా ద్వారా ప్రేక్షకులను కోరింది. మరి ఎన్నికలయ్యేంత వరకు నేను సినిమాల జోలికి పోను అన్నా పవన్ మంజుల రిక్వెస్ట్ చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here