మోహన్ బాబు చేత శభాష్ అనిపించుకున్న శ్రియ

విలక్షణ నటుడు మోహన్ బాబు చాలాకాలం తర్వాత హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు గాయత్రి సినిమా ద్వారా.ఇండస్ట్రీలో నటుడు మోహన్ బాబు వ్యక్తిత్వం చాలా విభిన్నమైన వ్యక్తిత్వం.ఏదైనా మొహం మీద మాట్లాడతారు నిర్మొహమాటంగా, అంతేకాకుండా సూటిగా స్పష్టంగా మాట్లాడతారు మోహన్ బాబు. అయితే ఈ క్రమంలో గాయత్రీ సినిమాలో నటించిన శ్రియను అభినందించారు మోహన్ బాబు. ఈ సినిమాలో విష్ణు భార్య పాత్రలో శ్రియ నటించింది.

తాజాగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి నేను చాలామంది కథానాయికలను పరిచయం చేశాను. వాళ్లంతా ఇప్పుడు బయట విఱ్ఱవీగుతున్నారు. శ్రియను నేను పరిచయం చేయలేదు, కానీ చాలా మంచి అమ్మాయి. ఈ సినిమాలో శ్రియ పోషించిన పాత్రను చూస్తే, ఆమె మాత్రమే చేయగలదనిపించింది. నాకే కాదు ఈ సినిమా చూసిన వాళ్లెవరికైనా అదే అనిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా శ్రియ మోహన్ బాబు గారి దగ్గర మంచి మార్కులు కొట్టేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here