షూటింగ్ పూర్తిచేసుకున్న క్షణం డైరెక్టర్ తో రానా నిర్మించిన సినిమా

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో రానా కి మంచి గుర్తింపు ఉంది. అయితే హీరోగా రాణిస్తూ మరోపక్క సినిమాను నిర్మిస్తున్నాడు రానా.ఈ క్రమంలో క్షణం సినిమా డైరెక్టర్ రవికాంత్ పేరెపు  తో సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనేర్ గా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో హీరో ‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధూ నటిస్తున్నాడు.

హీరోయిన్లుగా శీరత్ కపూర్, శ్రద్ధా శ్రీనాథ్, షాలిని నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయిన నేపథ్యంలో. ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాలి అని రానా భావిస్తున్నాడు.ఈ సినిమాను వేసవిలో  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తక్కువ బడ్జెట్తో సినిమాను తెరకెక్కించి ఎక్కువ లాభాలు అందిస్తాడు దర్శకుడు రవికాంత్ పేరెపు. క్షణం ఫేం కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. మరి నిర్మాతగా రానా ఏ మాత్రం డబ్బులు సంపాదిస్తాడో ఈ సినిమాతో.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here