పోలీసులకే షాక్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సెలబ్రిటీలకు  రాజకీయ నాయకులకు హీరోలకు ఇలా  ప్రతి ప్రముఖులకు షాక్ ఇస్తుంటాడు ట్విట్టర్ ద్వారా గాని మీడియా ద్వారా గాని. అయితే ఈసారి ఏకంగా హైదరాబాద్ పోలీసుల కు షాక్ ఇచ్చాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అసలు విషయమేమిటంటే రామ్ గోపాల్ వర్మ ఇటీవల జీఎస్టీ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా సృష్టించిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ సినిమా విడుదల నేపథ్యం లో జీఎస్టీ సినిమా మీద అనేక చర్చలు జరిగాయి.

జీఎస్టీ సినిమా చర్చ సమయంలో తనపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ వర్మపై సామాజిక కార్యకర్త దేవి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నేడు సీసీఎస్ పోలీసుల ముందు వర్మ హాజరు కావాల్సి ఉంది.ఈ నేపథ్యంలో, షూటింగ్ బిజీ వల్ల విచారణకు హాజరు కాలేనంటూ తన లాయర్ ద్వారా సీసీఎస్ పోలీసులకు వర్మ సమాచారం ఇచ్చాడు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ నాగార్జున నటిస్తున్న సినిమా  షూటింగ్ లో బిజీగా ఉన్నారు ముంబాయి లో.అయితే వచ్చే వారం హాజరవుతానని పోలీసులకు చెప్పారు రాంగోపాల్ వర్మ అది కూడా నోటీసులు వస్తేనే అని స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో వచ్చే వారం హాజరుకాకపోతే రామ్గోపాల్ వర్మని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు హైదరాబాద్ పోలీసులు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here