నిఖిల్ పక్కన హీరోయిన్ ఆ ఇద్దరిలో ఎవరికి వరిస్తుందో

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కు తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఉంది. కథను ఎంచుకోవడంలో హీరో నిఖిల్ చాలా వైవిధ్యంగా ఎంచుకుంటాడు.ఇప్పుడు కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తాడు హీరో నిఖిల్. ప్రస్తుతం హీరో నిఖిల్ కిరాక్ పార్టీ’ సినిమా చేస్తున్నాడు నిఖిల్ దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో తన తర్వాత సినిమాను లైన్లో పెట్టాడు నిఖిల్. తర్వాత చేయబోయే సినిమా తమిళ రీమేక్ సినిమా ‘కణితన్’ తెలుగు లో చేయబోతున్నాడు.

తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే తెలుగులో ఈ సినిమా కి దర్శకుడిగా  తమిళంలో తీసిన దర్శకుడనే తిసుకోవాలని భావిస్తున్నాడట నిఖిల్.అయితే నిఖిల్ జోడీగా కేథరిన్ సెట్ కాదనే ఫీడ్ బ్యాక్ రావడంతో, హీరోతోపాటు దర్శక నిర్మాతలు కూడా ఆలోచనలో పడ్డారు. కేథరిన్ విషయం పక్కన పెట్టేయాలనే నిర్ణయం తీసుకున్నారట. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ ను గానీ,మేఘా ఆకాశ్ ను గాని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారట. ముందుగా నిధి అగర్వాల్ ను సంప్రదించి, ఆమె కుదరదంటే మేఘా ఆకాశ్ ను అడగాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ ఇద్దరి లో ఎవరితో జోడీ కడతాడో హీరో నిఖిల్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here