వైసీపీ పార్టీ లోకి తిరిగి వచ్చేస్తున్నా వైసీపీ ఫిరాయింపు ప్రజా ప్రతినిధి?

గత సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్సీపీ పార్టీ తరపున గెలిచి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిన ఫిరాయింపుదారుల ప్రస్తుత పరిస్థితి చూస్తే చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న దేశం పార్టీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర వ్యతిరేకత భావములో ఉన్నారు అని వస్తున్న ప్రతి సర్వేలో వెల్లడవుతుంది ఈ విషయం. దీంతో వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి వెళ్లినా ప్రజాప్రతినిధులు అనవసరంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చామని పునరాలోచనలో పడ్డారట.

అందులో భాగంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మరల పార్టీలోకి రావాలని ఆలోచనలో పడ్డారు అంట. చంద్రబాబు వల్లే అభివృద్ధి సాధ్యమని వైసీపీ పార్టీ నుండి వెళ్లిపోయిన బుట్టా రేణుక ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చిరంజీవి వైసీపీ లోకి రావాలని చూస్తున్నారట. అంతే కాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత బుట్టా రేణుక ను భయపెడుతోందట.

అయితే ఇటివల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన మీడియాగా భావిస్తున్న రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వేలో వైసీపీ పార్టీ పన్నెండుకు పైగా ఎంపీ సీట్లను గెలుస్తుందని సర్వేలో వెల్లడైంది. ఈ 12 సీట్లలో కర్నూల్ పార్లమెంట్ కూడా ఉండడంతో  బుట్టా రేణుక ను కంగారు పడుతుంది.తను పార్టీ మారిన కానీ వైసీపీ క్యాడర్ అట్లనే ఉందని అర్ధమైన బుట్టా రేణుక చేసిన తప్పును తెల్సుకోవడమే కాకుండా దాన్ని సరిదిద్దుకునే క్రమంలో వైసీపీలోకి రావడానికి ఆరాటపడుతున్నారు. మరి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారోనని వైసీపీ మిగతా ఫిరాయింపు ప్రజా ప్రతినిధులు గమనిస్తున్నారాట ఒకవేళ బుట్టా రేణుక ను పార్టీలోనికి  రాణిస్తే మిగతా వైయస్ఆర్సీపీ ఫిరాయింపు దారులు కూడ తెలుగుదేశం పార్టీ నుండి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారట. మరి జగన్ ఈ  విషయంలో ఎలా స్పందిస్తాడో.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here