కేంద్ర బడ్జెట్ పై స్పందించిన కవిత

కేంద్రం ప్రకటించిన బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు నిజామాబాద్ పార్టీ ఎంపీ కవిత స్పందించారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన బడ్జెట్ పై రైతాంగం చాలా అసంతృప్తితో వుంది అన్నారు ఎంపీ కవిత. దేశంలో వ్యాపార రంగానికి పెద్దపీట వేసి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని రైతాంగం మీదనే దేశంలో చాలామంది ఆధారపడి ఉన్నారని స్పష్టం చేపి ఆవేదన చెందారు. బడ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టులకు అంతగా నిధులు కేటాయించకపోవడం రైతుల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో అర్ధమవుతుందని ఆమె అన్నారు .

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీకి తాము మద్దతు ఇచ్చినా.. కేంద్రం మాత్రం రైతులకు అండగా నిలువలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.అంతేకాకుండా దేశంలో  వ్యవసాయ ఎరువుల ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తు సబ్సిడీపై రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కవిత అన్నారు.గతంలో వ్యవసాయరంగానికి అండగా ఉంటామని కేంద్రం ఇలా  చేయడం దారుణమని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here