జీఎస్టీ 2 చేస్తా కానీ….యాంకర్ రష్మీ

ఇటీవల విడుదలైన రామ్ గోపాల్ వర్మ జీఎస్టీ అనేక సంచలనాలు సృష్టించింది. అనేక వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా చాల లాభాలు తెచ్చిపెట్టింది రామ్ గోపాల్ వర్మకి. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ జీఎస్టీ 2 సినిమా చేస్తానని షాకింగ్ ప్రకటన చేశాడు. దీంతో ఈ ప్రకటన పెద్ద సంచలనం అయ్యింది. సీక్వెల్ లో ఎవరు చేస్తారు అనే విషయంపై అనేక రూమర్స్ వెలువడుతున్నాయి. మొన్న ఆ మధ్య షకీలా నటిస్తాను అని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ వర్మ ఆ విషయంపై స్పందించలేదు.

అయితే తాజాగా ఇటీవల యాంకర్ రష్మీ జీయస్టీ సీక్వెల్ లో నటించడానికి పచ్చజెండా ఊపింది. కానీ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో కాదు వేరే దర్శకుడైతే నేను చేస్తా అని తన ట్విట్టర్ ద్వార వెల్లడించింది రష్మీ.రీసెంట్ గా ట్విట్టర్ లో తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసిన రష్మీకి ఒక నెటిజన్ నుంచి జీఎస్టీ 2 లో నటిస్తారా అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానం రేష్మ ఇవ్వదు అని అనుకొన్నారు. కానీ చాలా తెలివైన సమాధానాన్ని ఇచ్చింది. జీఎస్టీ 2 లో నటిస్తాను కానీ గరుడవేగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాలని తెలిపింది. దీంతో ప్రస్తుతం ఆ కామెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here