పవన్ ఏంటి ఆ తిక్క తిక్క మాటలు ?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రజాయాత్ర, తెలంగాణా రాజకీయాలలో మంచి  వేడి పుట్టించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే పర్యటనలో భాగంగా  ఖమ్మం జిల్లాలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ది జనసేన కాదు..బజనసేనా అని వీహెచ్ విమ‌ర్శించారు. అయితే ఈ క్రమంలో వి.హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఈవిధంగా స్పందించారు.
కాంగ్రెస్ అధిష్టానం వీహెచ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే, తన మద్దతు ఆ పార్టీకే అని, ఆ పార్టీ తరఫునే నిలబడి ప్రచారం చేస్తానని అంటున్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ అన, కాంగ్రెస్ నాయకులన నాకు గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. వి.హనుమంతరావు మీద నాకు  గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే ఏర్పడినది అని.. ఈ రాష్ట్రంలో అందరూ ప్రభుత్వానికి సహకరించాలని పవన్ పిలుపునిచ్చాడు. తెరాస ప్రభుత్వానికి అందరూ సహకరించాలని జనసేన అధినేత అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ వీహెచ్ ని  ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే పవన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాననడం ప్రస్తుత తెలంగాణా రాజకీయాలలో కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here