సినిమాలు చెయ్యడు కానీ ఇండస్ట్రీ ని వదలడు

పవన్ కళ్యాణ్ అభిమానులు కొంత నిరుత్సాహంలో ఉన్నారు. దీనికి గల కారణం తాజాగా మొన్న ఈ మధ్య పవన్  చేసిన వ్యాఖ్యలు. విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవుతూ సినిమాలకు దూరము అవ్వుతున్నరు అని ఇట్టివల ఆయన చేసిన వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. సినిమాల మీద ఆసక్తి లేదని రాజకీయాలే ప్రస్తుతం తన లక్ష్యమని తేల్చి చెప్పేశాడు పవన్ కళ్యాణ్.
అయితే తాజాగా పవన్ ఫ్యాన్స్ కు ఊరట కలిగించే విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ శాశ్వతంగా సినిమాలకు దూరం కాలేదట, వీలున్నప్పుడల్లా గెస్ట్ పాత్రలో మెరిసే అవకాశం ఉందని పవన్ కి దగ్గరగా ఉండే సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో పవన్ తాను ఒప్పుకొన్న సినిమాలు చేయాల్సి ఉంది. ఈ విషయంలో స్పష్టత ఇంత  వరకు రాలేదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సినిమాలకు హీరోగా దూరమైనా కాని నిర్మాతగా సినిమాలను నిర్మించే దిశగా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.అందుకే పి కె  క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ప్రారంభించాడట. ప్రస్తుతం ఈ బ్యానర్లో నితిన్ హీరో గా పవన్ కళ్యాణ్ సినిమా నిర్మిస్తున్నాడు.ఈ  విధంగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ కి దూరం కాకుండా తన  జాగ్రత్తలో తాను ఉన్నాడు.అంతేకాకుండా  ఇండస్ట్రీ కి తన బ్యానర్ ద్వారా ఓ కొత్త దర్శకుని పరిచయం చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here