నయనతార మనసు పడితే దిగ్విజయమే

దక్షిణాది చలనచిత్ర రంగంలో టాప్ హీరోయిన్ గా నయనతారకు మంచి పేరు ఉంది.అప్పట్లో తనతోపాటు చేసిన హీరోయిన్స్ ఇప్పుడు సీనియర్ హీరోయిన్లు గా ఇండ్రస్టీలో చలామణీ అవుతున్నారు. ఇదే క్రమంలో హీరోయిన్ నయనతారకు మాత్రం వయసు మీద పడుతున్నా క్రేజ్ తగ్గడం లేదు. ప్రస్తుతం నయనతార కున్న క్రేజ్ బట్టి సూపర్ స్టార్ అని చెప్పవచ్చు.
ఈ సందర్భంగా నయనతార తన స్టార్ డమ్ గ్రహించి లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు మాత్రం ఓకే చెబుతోంది. అంతేకాకుండా తాను చేస్తున్న సినిమాలకు నిర్మాతలు చేతులెత్తేసిన క్రమంలో తానే నిర్మాతగా మారి తాను నమ్మిన కథ,  సినిమాను ఆగకుండా చూసుకుంటుంది. ఈ విషయం “ఆరమ్” చిత్రం సమయంలో అర్థమవుతుంది. ఈ సినిమా నిర్మాతలు అర్ధాంతరంగా తప్పుకుంటే నయనతార తానే నిర్మాతగా  భాగస్వామిగా వ్యవహరించింది. అయితే తాజాగా ఇదే విధంగా  నయనతార ..’ఈరమ్, కుట్రమ్ 23’ సినిమాల ద్వారా మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అరివాలగాన్ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకొంది.
ఇక ఈ క్రమంలో సినిమా నిర్మాతలు ప్రాజెక్టు నుంచి ఉన్నట్టుండి పక్కకు తప్పుకున్నారు. ఈ క్రమంలో కథను నమ్మి నా నయనతార ఎలాగైనా సినిమా తీయాలని పూర్తిస్థాయి నిర్మాతగా మారాలని నిర్ణయించుకుందట. ఈ క్రమంలో నయనతార నమ్మిన కథను ఎలాగైనా తీయాలని చూపిస్తున్న తపన చూసి అందరు ఆమెను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అంటున్నారు. అంతేకాకుండా కథను బట్టి ఏది విజయం సాధిస్తుందో చెప్పగల సత్తా జడ్జిమెంట్ నయనతార కు వుందని అందుకే ఆమె కథను నమ్మి నిర్మాతగా వ్యవహరిస్తారని చాలామంది అంటారు. ఈ  విషయం ఆరమ్ విషయంలో అర్థమయింది అందరికీ సినిమా నిర్మాతలు అర్థాంతరంగా పక్కకు వెళ్లినా ఆమె చాకచక్యంగా వ్యవహరించి నిర్మాతగా మారింది. సినిమా అద్భుతంగా విజయం సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here