వైన్ షాప్ ఓపెన్ చేసి అడ్డంగా బుక్ అయిన స్వాతి :

కాస్తంత నిర్లక్ష్యంగా ఉంటె చాలు మీడియా ముందర అడ్డంగా దొరికిపోతున్న రోజులు ఇవి. ముఖ్యంగా సెలెబ్రిటీ ల కష్టాలు చెప్పక్కరలేదు. పబ్లిక్ ఫిగర్ అయితే చాలు మీడియా కళ్ళు అన్నీ వారి మీదనే ఉంటాయి. తాజాగా యూపీ మంత్రి స్వాతి సింగ్ ఒక అనుకోని పని చేసి ఇరుక్కున్నారు. గోంతీన‌గ‌ర్ లోని బీ ద బీర్ అనే వైన్ షాపు ప్రారంభించారు మంత్రి స్వాతి సింగ్‌. ఓప‌క్క మ‌ద్య‌పాన నిషేధం గురించి మాట‌లు చెప్పే ప్ర‌భుత్వంలో.. మంత్రి వ‌ర్యులే వైన్ షాప్ ఓపెన్ కావ‌టం సంచ‌ల‌నంగా మారింది. సోషల్ మీడియా లో మెయిన్ స్త్రీం మీడియా లో ఈ వ్యవహారం రచ్చని లేపింది.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ కి ఆమె వివరణ ఇచ్చేవరకూ వెళ్ళింది పరిస్థితి. ఏకంగా ఆమె ఐపీఎస్ అధికారి తో వెళ్లి వైన్ షాప్ ఓపెన్ చేసారు , ఆ వీడియో ఇంటర్నెట్ లో దర్శనం ఇస్తోంది. మద్య నిషేధం కోసం అందరు మహిళలూ నడుం బిగిస్తున్న వేళలో మహిళా మంత్రి అయిన ఆమె లిక్కర్ షాప్ ఓపెన్ చెయ్యడం ఆశ్చర్యకరం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here