
కరోనా టెస్టుల నిర్వహణలో అమెరికా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. కోవిడ్ టెస్టుల్లో అమెరికా దరిదాపుల్లో ఇంకే దేశం లేదన్నారు.
ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ తీసుకొస్తామని ట్రంప్ చెప్పారు. కాగా భారత్ అమెరికా తర్వాతి స్థానంలో ఉందన్నారు ట్రంప్. అమెరికాలో ఇప్పటివరకు 65 మిలియన్ల కోవిడ్ టెస్టులు నిర్వహించామన్నారు. ఆ తర్వాత 150 కోట్లు ఉన్న భారత్లో 11 మిలియన్ల టెస్టులు నిర్వహించారన్నారు. అయితే భారత్ అమెరికాను మించలేదన్నారు.
ప్రపంచంలో ఏ దేశం నిర్వహించని నాణ్యమైన టెస్టులు అమెరికా చేసిందన్నారు. గత వారం రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందన్నారు. దేశంలో వారం రోజుల్లో 14 శాతం కరోనా కేసులు తగ్గాయని.. ఆస్పత్రుల్లో చేరే వారిసంఖ్య 7శాతం, మరణాలు 9శాతం తగ్గాయని తెలిపారు.