ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న ఏపీ సీఎం

రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి చెప్పారు. రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో పీఎం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మోడీతో జ‌గ‌న్ మాట్లాడారు.

ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న జ‌గ‌న్ ఏపీలో క‌రోనా క‌ట్ట‌డి తీసుకుంటున్నచ‌ర్య‌ల‌పై పూర్తి స్థాయిలో వివ‌రించారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 25 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా నిర్దార‌ణ ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు జ‌గ‌న్ చెప్పారు. క‌రోనా వ్యాధి నిర్దార‌ణ అయితే త‌ద్వారా చికిత్స చేసి మ‌ర‌ణాలు పెర‌గ‌కుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంద‌న్నారు. గ‌తంలో ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఆక్సిబెడ్లు 3286 ఉండేవి.. ప్ర‌స్తుతం 11వేల‌కు పైగా ఆక్సిబెడ్లు ఉన్నాయ‌ని వివ‌రించారు.

ఏపీలో 0.89 శాతంగా మ‌ర‌ణాల రేటు ఉంద‌ని జ‌గ‌న్ తెలిపారు.  పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలియ‌గానే వెంట‌నే వారిని కోవిడ్ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించ‌డం, క్వారంటైన్ చేయ‌డం ప్ర‌ణాళికా బ‌ద్దంగా చేస్తున్నామ‌న్నారు. లాక్ డౌన్ కి సంబంధించి ప్ర‌జ‌ల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళుతున్న‌ట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో క‌రోనా క‌ట్ట‌డికి కృషి చేస్తున్నామ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here