రూట్ మార్చిన అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌

మొన్న‌టి వ‌ర‌కు మాస్క్ ధ‌రించ‌న‌ని చెప్పిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇప్పుడు మాస్కు లేనిదే బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అమెరికాలో పెరుగుతున్న కేసుల తీవ్ర‌త‌ను బ‌ట్టి చూస్తే ట్రంప్ విధానంలో మార్పులు క‌నిపిస్తున్నాయి.

అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉదృతి ఎక్కువ‌గా ఉంది. ప్ర‌తి రోజూ అమెరికాలో 60వేల‌కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో 38 ల‌క్ష‌ల కేసులు ఉండ‌గా.. దాదాపు ల‌క్ష‌న్న‌ర మంది మృత్యువాత పడ్డారు. టీకా వ‌చ్చే వ‌ర‌కూ ఈ మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ట్రంప్ తీసుకున్న మాస్క్ నిర్ణ‌యం స‌రైందే అని నెటిజ‌న్లు చెప్పుకొస్తున్నారు.

తాజాగా మాస్క్‌తో ఉన్న ఫోటోను ఆయ‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. చైనా వైర‌స్‌ను అరిక‌ట్ట‌డంలో మ‌న‌మంతా క‌లిసిక‌ట్టుగా పోరాడుతున్న‌ట్లు చెప్పారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ భౌతిక దూరం పాటించాల‌ని.. అలా చెయ్య‌లేని ప‌క్షంలో మాస్కు ధ‌రించాల‌న్నారు. త‌న‌క‌న్నా దేశ‌భ‌క్తుడెవ్వ‌రూ లేని ట్రంప్ ట్వీట్ చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు న‌మోదు, మ‌ర‌ణాల్లో అమెరికా ప్ర‌థ‌మ స్థానంలో కొన‌సాగుతుండ‌గా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ప‌ట్ల విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముందునుంచీ తగు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన వారు ఇప్పుడు ఇలా చేస్తే ఏం లాభం అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడైనా ట్రంప్ మాస్క్‌తో క‌నిపించ‌డం సంతోష‌మంటూ మ‌రికొంద‌రు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here