మరో తెలుగు సినిమాలో ఉపేంద్ర..

ఒకప్పుడు కన్నడలో స్టార్ హీరోగా ఎదిగాడు ఉపేంద్ర. వైవిధ్యమైన  సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఉపేంద్ర నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ కన్నడ హీరోకు తెలుగులోనూ అభిమానులున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తితో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఉపేంద్ర… తాజాగా మరో తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శుక్రవారం ఉపేంద్ర పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఉపేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వరుణ్ తేజ్.. ఓ పోస్టర్ ను ట్వీట్ చేశాడు. అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తుండ‌గా.. అల్లు వెంక‌టేశ్‌, సిధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here