గూగుల్ నుంచి పేటీఎం అవుట్.. కార‌ణం ఇదే..

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎంను తొల‌గించ‌డంతో ఒక్క‌సారిగా ఆందోళ‌న నెల‌కొంది. అయితే వెంట‌నే పేటీఎం స్పందించి దీనిపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించ‌డంతో వివాదంపై దుమారం ఆగింది. కాగా పేటీఎంకు నెలవారీ 5 కోట్ల మంది యూజ‌ర్స్ ఉన్నారు.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉన్న‌ట్టుండి పేటీఎంను తొల‌గిస్తూ గూగుల్ నిర్ణ‌యం తీసుకుంది. పేటీఎం ఫ‌స్ట్ గేమ్స్‌ను కూడా తొల‌గించింది. అయితే పేటీఎం బిజినెస్‌, పేటీఎం మాల్‌, పేటీఎం మ‌నీ యాప్స్‌ను మాత్రం అలాగే ఉంచింది. దీంతో ఏమైంద‌న్న ఆందోళ‌న పేటీఎం యూజ‌ర్స్‌లో నెల‌కొంది. అయితే వెంట‌నే దీన్ని త్వ‌ర‌లోనే అందుబాటులోకి తెస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

కాగా పేటీఎంను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎందుకు తొల‌గించారంటే గూగుల్ లో జూదాలు, ఆన్‌లైన్ బెట్టింగులు నిర్వ‌హించ‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌లు ఉన్నాయి. అయితే పేటీఎంతో పాటు పేటీఎం ఫ‌స్ట్ గేమ్‌లో ఫాంట‌సీ క్రికెట్ సేవ‌లు మొద‌లుపెట్టింది. దీంతో జూదాన్ని ప్రేరేపించేలా ఈ చ‌ర్య ఉండ‌టంతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎంను తొల‌గించింద‌. అయితే గూగుల్ ఇది వ‌ర‌కు పేటీఎంకు  నోటీసులు జారీ చేసింది. అయిన‌ప్ప‌టినీ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంతో చ‌ర్య‌లు తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here