కళ్యాణిని ప్రతిరోజు మిస్ అవుతున్నాను..!

స‌త్యం, ధ‌న 51, బ్ర‌హ్మాస్త్రం, రాజు భాయ్ వంటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సూర్య‌కిర‌ణ్ తర్వాత మరే సినిమా చేయలేదు. తాజాగా బిగ్ బాస్ 4 ద్వారా మళ్లీ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే సూర్య కిరణ్ తొలివారంలోనే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సూర్య కిరణ్ ను పలు చానళ్లు ఇంటర్వ్యూలు చేస్తున్నాయి.

తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు సూర్య కిరణ్. ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, వసంతం లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి కళ్యాణి… సాయి కిరణ్ ను వివాహం చేసుకుంది. అయితే కొన్నేళ్లు కలిసున్న ఈ జంట తర్వాత విడిపోయినట్టు ఇటీవలే తెలిసింది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడిన సూర్య కిరణ్.. ‘అవును కళ్యాణి నన్ను వదిలి వెళ్ళింది నిజమే. అది నా నిర్ణయం కాదు, నాతో కలిసి జీవించాలని కళ్యాణికి ఇష్టం లేదు. నాతో ఎలాంటి సమస్యలు లేకున్నా.. కలిసి జీవించకపోవడానికి ఆమెకు కారణాలున్నాయి. నేను బిగ్ బాస్ కి  వెళ్లిన తర్వాత కళ్యాణిని మిస్ అవ్వడం కాదు… ప్రతిరోజు మిస్ అవుతున్నాను. ఈ జన్మకి నా భార్య కళ్యాణియే’ అంటూ ఎమోషనల్ అయ్యాడు సూర్య కిరణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here