ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌… ఓ క‌లెక్ట‌ర్‌కు పాజిటివ్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభిస్తూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 8096 కేసులు న‌మోద‌య్యాయి. ఇన్ని రోజులు సామాన్యులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు తాగిన క‌రోనా ఇప్పుడు ఐఏఎస్‌ల‌ను తాకుతోంది. తాజాగా క‌లెక్ట‌ర్‌కు పాజిటివ్ వ‌చ్చింది.

ఏపీలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కేసుల సంఖ్య‌ 6,09,558కి చేరింది. ఈ రోజు కొత్త‌గా 74,710 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. ఇందులో 8096 పాజిటివ్‌గా వ‌చ్చాయి. కాగా చిత్తూరు క‌లెక్ట‌ర్ నారాయ‌ణ భ‌ర‌త్ గుప్త‌కి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈయ‌న ఐసోలేష‌న్‌లోకి వెళ్లిపోయారు. క‌లెక్ట‌ర్ భ‌ర‌త్ ఇటీవ‌లె విజ‌య‌వాడ వెళ్లి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత ఆయ‌న క‌రోనా ప‌రీక్ష చేయించుకోగా క‌రోనా పాజిటివ్ అని వ‌చ్చింది.

రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 5244 మంది చ‌నిపోగా.. నేడు 67 మంది చ‌నిపోయారు. కాగా ఒక్క రోజులో 11,803 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 5,19,891 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49,59,081 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి క‌రోనా క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. క‌రోనా విష‌యంలో ఇప్ప‌టికే అధికారుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. క‌రోనా విష‌యంలో ఎలాంటి స‌హ‌కారం కావాల‌న్నా బాదితుల‌కు ఇచ్చేందుకు జిల్లా యంత్రంగాం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here