రాజమౌళి లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నాడా..?

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం) అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాటికి తగ్గట్లుగానే అత్యంత భారీ తారాగణంతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళి కుటుంబం కూడా కరోనా బారిన పడింది. అయితే తాజాగా కరోనాను జయించిన జక్కన్న.. కుటుంబంతో కలిసి కర్ణాటక జిల్లాలో టూర్ కి వెళ్ళాడు.

గత మూడు రోజులుగా ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో  భాగంగా అటవీ ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాలను సందర్శించారు. దీంతో రాజమౌళి లోకేషన్స్ వేట కోసమే ఈ పర్యటన చేస్తున్నాడని.. సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌.. అటవీ ప్రాంతాల నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో ఈ వార్తలకు బలం చేకూర్చినట్లవుతుంది. త్వరలోనే చిత్రీకరణను తిరిగి ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here