ద‌ట్ ఈజ్ ట్రంప్‌.. అన్నంత ప‌నీ చేశాడు..

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత ప‌నీ చేశాడు. ముందు నుంచీ టిక్ టాక్‌ను వ్య‌తిరేకిస్తున్న ట్రంప్‌.. టిక్ టాక్‌ను నిషేధిస్తూ సంచ‌లన నిర్ణ‌య‌మే తీసుకున్నాడు. ఆదివారం నుంచి అమెరికాలో టిక్‌టాక్ యాప్‌ల డౌన్‌లోడ్ ను నిషేధిస్తున్న‌ట్లు అమెరికా వాణిజ్య విభాగం పేర్కొంది.

అమెరికా ముందు నుంచీ టిక్ టాక్ విష‌యంలో సీరియ‌స్‌గానే ఉన్నారు. అమెరికా పౌరుల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని చైనా సేక‌రిస్తోంద‌ని వాణిజ్య విభాగం చెబుతోంది. దేశ భ‌ద్ర‌త కారణాల వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు తెలిపింది. కాగా ఇటీవ‌ల అమెరికాలో టిక్‌టాక్‌ను నిర్వ‌హించేందుకు మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్ ముందుకొచ్చాయి. అయితే మైక్రోసాఫ్ట్ మ‌ళ్లీ వెన‌క్కు వెళ్లిపోయింది. తాజాగా ఒరాకిల్ ఈ డీల్ కుదుర్చుకుంద‌ని టాక్ వినిపించింది.

దీనిపై ట్రంప్ కూడా స్పందించారు. ఒరాకిల్‌లో మెజార్టీ షేర్ చైనాకు సంబంధించిన వారితే ఉంద‌ని త‌న తెలిసింద‌న్నారు. అయితే విష‌యం మా దృష్టికి వ‌చ్చాక పూర్తిగా దీనిపై ఆలోచిస్తాన‌ని చెప్పారు. ఆయ‌న కామెంట్ చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే టిక్‌టాక్‌ను నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు ట్రంప్‌. టిక్ టాక్ కంపెనీ వంద మిలియ‌న్ల అమెరికా పౌరుల స‌మాచారాన్ని యాక్సిస్ చేస్తున్న‌ట్లు భ‌ద్ర‌తా రంగ నిపుణులు చెబుతున్నారు. తాజాగా టిక్‌టాక్‌తో పాటు వీచాట్‌ను కూడా అమెరికా నిషేధించింది. అమెరికా నిషేధంపై చైనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here