తెలుగుదేశం అధినేత ఒత్తిడిలో ఉన్నారా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడును ఒత్తిడిలో ప‌డేస్తున్నాయా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణ‌యాల ప‌ట్ల ప్ర‌తిప‌క్ష టిడిపి అనుక్ష‌ణం అడ్డుత‌గులుతూనే ఉంది. ఈ ప‌రిస్థితుల్లో అందుకు ధీటుగా వైసీపీ ప్ర‌భుత్వం ఎత్తుగ‌డ వేస్తోంది.

ఏపీ ప్ర‌భుత్వం దూకుడు పెంచిన‌ట్లు క‌నిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఎదుర‌వుతున్న న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌పై ఇన్నాళ్లూ జ‌గ‌న్ స‌ర్కార్ సైలెంట్‌గానే ఉంది.  కానీ ఇప్పుడు జ‌రుగుతున్న పార్ల‌మెంటు స‌మావేశాలను ఇందుకు అవ‌కాశంగా మ‌ల్చుకోవాల‌ని చూస్తోంది. అందుకే ఇటీవ‌ల అమ‌రావ‌తి కుంభ‌కోణం కేసులో విచార‌ణ వ‌ద్ద‌ని, ఎఫ్‌.ఐ.ఆర్ వివ‌రాలు కూడా వెల్ల‌డించ‌వ‌ద్ద‌ని మీడియాను నియంత్రించిన విష‌యం తెలిసిందే. దీనిపై ఇప్పుడు వైసీపీ లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో ప్లానింగ్‌గా ముందుకు వెళుతోంది.

ఇప్పటికే ఏపీ హైకోర్టు ఏ విధ‌మైన తీర్పులు ఇచ్చిందో విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. రాజ్యాంగంలోకి అధిక‌ర‌ణ 105 ప్ర‌కారం వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంద‌ని తెలుస్తోంది. అమ‌రావ‌తి భూ కుంభ‌కోణంపై పార్లమెంటు ఆవ‌ర‌ణంలో వైసీపీ ఆందోళ‌న చేసింది. ఇక రాజ్య‌స‌భలో విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌సంగిస్తుండ‌గా టిడిపి ఎంపీలు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాకుండా అమ‌రావ‌తి భూముల వ్యవ‌హారంలో కోర్టు తీర్పుల‌పై టిడిపి స్పందించిన తీరు కూడా ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. దీన్ని బ‌ట్టి వైసీపీ నేత‌లు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంటే టిడిపి ఇరుక్కుపోతున్న‌ట్లు తెలుస్తోంది. పైగా ఇటీవ‌లె విజ‌య‌వాడ ర‌మేష్ హాస్పిట‌ల్స్ అధినేత డాక్ట‌ర్ ర‌మేష్ కేసులో కూడా హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తే విచార‌ణ చేప‌ట్టాల‌ని చెప్పారు.

ఇదే త‌ర‌హాలోనే అమ‌రావ‌తి భూ కుంభ‌కోణం కేసును కూడా సుప్రీంకోర్టులో స‌వాల్ చేసేందుకు వైసీప రెడీ అవుతోంది. మ‌రి ఈ కేసులో కూడా సుప్రీంకోర్టులో విచార‌ణ చేయాల‌ని తీర్పు వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. దీన్ని బ‌ట్టి ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఒత్తిడిలో ఉన్నార‌ని పొలిటిక‌ల్ డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here