సిద్దార్థ్‌ ని లైన్ లో పెడుతున్న.. ‘ఆరెక్స్100’ దర్శకుడు.!

‘ఆరెక్స్100’ సినిమాతో ఒక్కసారి ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే అజయ్ భూపతి తన తర్వాతి చిత్రాన్ని శర్వానంద్ తో చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. మహా సముద్రం పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మల్టీస్టారర్ గా  తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో హీరోగా బొమ్మరిల్లు ఫేమ్ సిద్దార్థ్ నటించనున్నట్లు తెలుస్తోంది. అజయ్ భూపతి చెప్పిన కథ నచ్చడంతో సిద్దు వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం.

తెలుగులో పలు సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్ 2013లో వచ్చిన బాద్షా  తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించాడు. సుదీర్ఘ విరామం తర్వాత సిద్ధార్థ్ మళ్లీ తెలుగు ప్రేక్షకులను మహా సముద్రంతో పలకరించనున్నాడన్న మాట. వైజాగ్ బీచ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here