తొలిసారి ఆ పాత్రలో నటించనున్న సమంతా.!

కేవలం గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది నటి సమంత. ఇదివరకు సామ్ నటించిన కొన్ని చిత్రాలు దీనికి ఉదాహరణ. పలు చిత్రాల్లో డి గ్లామర్ రోల్ లో నటించి కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందీ చిన్నది. ఇదిలా ఉంటే సమంత మరోసారి చాలెంజింగ్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

సమంత ప్రధాన పాత్రలోగేమ్ ఓవర్ఫేమ్ అశ్విన్శరవణన్దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తెలుగుతమిళహిందీ భాషల్లో సినిమాను తీయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమాలో సమంత తొలిసారి దివ్యాంగురాలి(మాటలు రాని, చెవులు వినపడని) పాత్రలో నటించనుందని సమాచారం. మరి ఇలాంటి చాలెంజింగ్ పాత్రలో సమంత ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here