నాకు ఆ టికెట్లు ఇప్పించడం తెలియదు బ్రదర్

కరోనా కారణంగా నష్టపోయిన వారికి సహాయం అందిస్తూ సోనుసూద్ హీరోగా మారిన విషయం తెలిసిందే. సినిమాల్లో విలన్ పాత్రలో నటించే సోనూ..  ఆపదలో ఉన్నవారికి మాత్రం హీరో అవుతున్నాడు. సాయం అడిగినవారికి ఏదో రకంగా తోడ్పాటును అందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం ట్విట్టర్ లో ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. ఒకరు ఐఫోన్ కావాలని అడిగితే…  మరొకరు నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ చేయమని సోనూసూద్ కు మెసేజ్ లు పెడుతున్నారు. అయితే వీటికి సోనూ కూడా అదే స్థాయిలో ఫన్నీ రిప్లై ఇస్తున్నాడు.

తాజాగా ఓ నెటిజెన్ కోరికకు స్పందిస్తూ…  సోనూ ఇచ్చిన రిప్లై నవ్వులు పూయిస్తోంది.ఓ నెటిజన్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించమని సోనూను కోరాడు. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయడానికి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించమని అడిగాడు. దీనికి స్పందించిన సోనూ అంతే ఫన్నీగా రిప్లై ఇస్తూ.. ‘బస్సు, రైలు, విమానం టికెట్లు తప్ప వేరే టికెట్లు ఇప్పించడం తెలియదు బ్రదర్` అని రిప్లై ఇచ్చాడు. సోనూ ఇచ్చిన రిప్లై నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here