ర‌ష్యా వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్‌.. మ‌రి వ్యాక్సిన్ ఎలా..

ర‌ష్యా టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తున్నాయ‌న్న వార్త‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వేగంగా ర‌ష్యా క‌రోనాను వైర‌స్‌ను క‌నిపెట్టిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌పంచం మొత్తం ర‌ష్యావైపు చూస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో ర‌ష్యా వ్యాక్సిన్‌పై వ‌స్తున్న పుకార్లు అంద‌రినీ టెన్ష‌న్‌కి గురి చేస్తున్నాయి.

క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌కు ర‌ష్యా స్నుతిక్ వి అని పేరు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ స్నుతిక్ వి వ్యాక్సిన్ ఇప్ప‌టికే రెండు ద‌శ‌ల్లో ప్ర‌యోగాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ ప‌రిస్థితుల్లో ఇక అతి కొద్ది రోజుల్లోనే ర‌ష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని అంతా అనుకుంటున్నారు. ఈ మ‌ధ్యే ర‌ష్యా భార‌త్‌లో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను భార‌త్‌లో నిర్వ‌హించాల‌నుకుంటోంది.

మొన్న డాక్ట‌ర్ రెడ్డీస్ తో అంగీకారం చేసుకుంది. ప‌దికోట్ల డోసుల వ్యాక్సిన్‌ను భార‌త్‌కు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు ర‌ష్యా వ్యాక్సిన్‌లో దుష్ప‌లితాలు వ‌స్తున్నాయ‌ని తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ ప్ర‌యోగించిన ప్ర‌తి ఏడుగురిలో ఒక్క‌రికి సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తున్నాయ‌ని ర‌ష్యానే తెలిపింది. ఇలాంటి వైర‌స్‌ల‌కు ఇచ్చే వ్యాక్సిన్‌లో ఇలాంటి ప్ర‌భావాలు క‌నిపిస్తాయ‌ని అయితే ఇందులో ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏమీ లేద‌ని తెలిపింది. ప్ర‌ధానంగా వ్యాక్సిన్ వ‌ల్ల వ‌స్తున్న సైడ్ ఎఫెక్ట్స్‌ల‌లో త‌ల‌నొప్పి, ఒల్లు నొప్పులు ,జ్వ‌రం, వ్యాక్సిన్ ఇచ్చిన భాగంలో నొప్పి ఉంటాయ‌ని తెలిపింది. అయితే దీని వ‌ల్ల ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here