ర‌ష్మిక గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాస‌న‌..

దీపావ‌ళి వ‌చ్చిందంటే ఎంతో సంబ‌రంగా చేసుకుంటారు. సెల‌బ్రెటీల విష‌యంలో ఇంకా హ‌డావిడి కనిపిస్తూ ఉంటుంది. ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రాం చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కూడా ఈ దీపావ‌ళిని ఎంతో ప్ర‌త్యేకంగా జ‌రుపుకుంటున్నారు. ఉపాస‌న మెగా కోడ‌లి గానే కాకుండా ప్ర‌త్యేక‌మైన గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.

ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను యువర్ లైఫ్ అనే వెబ్ పోర్టల్ ప్రారంభించి ఉపాస‌న అంద‌రికీ చెబుతున్నారు. తాజాగా ఈ పోర్ట‌ల్‌లో హీరోయిన్‌ ర‌ష్మిక గెస్ట్‌గా వ‌చ్చారు. ర‌ష్మిక‌తో మాట్లాడిన విష‌యాల‌ను ఉపాస‌న వెల్ల‌డించారు. చాలా సరదాగా ఉండే ర‌ష్మిక మనస్తత్వం మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుందని ఉపాస‌న అన్నారు. జీవితాన్ని మరింత అందమైన, అర్థవంతమైన లెన్స్‌తో చూడండి. ఈ దీపావళి ఎంత సరదాగా ఉండాలని లేదా ఎంత బోరింగ్‌గా ఉండాలని మీరు అనుకుంటారో.. అలాగే ఉంటుంది. నిర్ణయించుకోవాల్సింది మీరే. నేను మాత్రం రష్మికతో మాట్లాడడాన్ని బాగా ఆస్వాదించా అని ఫోటోలు ఇన్‌స్టాలో పోస్టు చేసి ఉపాస‌న కామెంట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here