ముఠా మేస్త్రి సీన్ నిజంగా జరిగింది .. రోడ్లు ఊడ్చిన ముఖ్యమంత్రి :

ముఠా మేస్త్రి సినిమాలో చిరంజీవి మంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయ్యి రోడ్లు ఊడుస్తూ ఉంటె ఆ సినిమాకి హై లైట్ సీన్ లుగా ఉండేవి అవి. అలా బయట ఏ ముఖ్యమంత్రి అయినా ఫోటోలకి ఫోజు కోసం తప్ప చెత్తా ఊడుస్తాడా ? జరిగే పని కాదు అంటారా ? కానీ జరిగింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ముఠా మేస్త్రి స్టైల్ లో చీపురు పట్టుకుని మురికివాడ లో ఈ స్పెషల్ కార్యక్రమం చేపట్టారు.

రాం మోహన్ భాగ్ ఉన్న ప్రాంతం లో టాయిలెట్ లని కూడా సందర్శించిన యోగి అక్కడ ఉన్న వర్కర్ లతో వారి ఇబ్బందులు ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. శుభ్రత ఎంత ముఖ్యం అనేది వారికి వివరించారు కూడా. . టాప్ 100 స్వచ్ఛ నగరాల్లో యూపీ నుంచి కేవలం ఒక సిటీ మాత్రేమే చోటు సంపాదించుకుంది. దీంతో, ప్రజల్లో శుభ్రత గురించి చాలా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించిన యోగి… స్వయంగా రంగంలోకి దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here