ఎనిమిది వందల కోట్ల మహా కలక్షన్ లతో బాహుబలి సంచలనం

అనితర సాధ్యమైన కలక్షన్ లతో దూసుకుని పోతోంది బాహుబలి చిత్రం. భారతీయ చలన చిత్ర రికార్డులు అన్నీ కూడా తమ ఖాతాలో వేసుకుంటున్న బాహుబలి ఇండియా లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తోంది. దాదాపు వెయ్యి కోట్ల గ్రాస్ కోసం దూసుకుపోతున్న ఈ సినిమా తొమ్మిది వేల థియేటర్ లలో హైక్ ప్రైస్ తో సాగుతోంది.
విడుదల అయిన అన్ని భాషల్లో కలిపి ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు వసూలు చేసింది. మన దేశం లో దాదాపు ఆరొందల తొంభై ఐదు రూపాయల గ్రాస్ సాధించి విదేశాల్లో నూట అరవై ఐదు కోట్లు లాగేసింది. ఇవాళ నుంచీ రెండో వారం లో అడుగు పెట్టిన ఈ సినిమాకి దరిదాపుల్లో పోటీ ఇచ్చే సినిమా కనపడ్డం లేదు. ఇప్పటికే అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఈ సినిమా రికార్డు పుటలకెక్కింది.  రాజమౌళి డైరెక్షన్ , ప్రభాస్ నటన ఈ సినిమాని ఉన్నత రేంజ్ కి తీసుకెళ్ళాయి అని చెప్పాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here