మీరు త‌గ్గేదాకా మేమూ త‌గ్గ‌మ‌ని తేల్చి చెప్పారు.. రాజ‌కీయాలు కాదు.

ముందు మీరు వెన‌క్కు వెళితే ఆ త‌ర్వాత మేము కూడా తగ్గి వెన‌క్కు వెళ్లిపోతామ‌ని అంటున్నది ఎవ‌రో కాదు భార‌త సైన్యం. చైనా భార‌త్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇటీవ‌ల జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ప్ర‌ధానంగా ఇరు దేశాలు బ‌ల‌గాల‌ను వెన‌క్కు తీసుకోవ‌డం ఉద్దేశం. అయితే ఇందులోనే ప్ర‌తిష్టంభ‌న నెల‌కొంది.

స‌రిహ‌ద్దులో కీల‌క‌మైన ప్రాంతాల్లో భార‌త్‌, చైనా బ‌ల‌గాల‌ను సిద్ధం చేసి ఉంచాయి. ఏక్ష‌ణం ఏం జ‌రిగినా సిద్ధంగా ఉండేందుకు ఇరు దేశాలు బ‌ల‌గాల‌ను రెడీ చేసుకున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఇటీవ‌ల విదేశాంగ మంత్రులు, కోర్ క‌మాండ‌ర్ స్థాయిలో చ‌ర్చ‌లు జ‌ర‌గ్గా వీటిలో ఇప్పుడున్న ప‌రిస్థితులు ఇంకా తీవ్ర‌త‌రం కాకుండా ఏం చేయాల‌న్న దానిపై చ‌ర్చించారు. ప్ర‌ధానంగా కొంత‌మేర బ‌ల‌గాలు వెన‌క్కు తీసుకోవాల‌ని ఇరు దేశాలు నిర్ణ‌యించాయి. అయితే ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య వచ్చి ప‌డింది. చాలా ప్రాంతాల్లో చైనా బ‌ల‌గాలు మొహ‌రించాయి. అయితే భార‌త్ కూడా కీల‌క‌మైన ప్ర‌దేశాల‌ను సొంతం చేసుకొని ఆధిప‌త్యంలోనే ఉంద‌ని తెలుస్తోంది.

ఇండియా బ‌ల‌గాలు వెన‌క్కు తీసుకోవాలంటే చైనా బుద్దిని బ‌ట్టి ముందుకు వెళ్ల‌డం జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఇన్ని రోజులు కేవలం ఓక‌వైపు మంచి మాట‌లు చెబుతూనే చైనా దురాక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డింది. ఒక‌వైపు చ‌ర్చ‌లు జ‌రుగుతూనే మ‌రోవైపు త‌న వ‌క్ర‌బుధ్దిని చాటుకుంటూ వ‌చ్చింది. ఈ ప‌రిస్థితుల్లో ఇప్పుడు చైనా తగ్గితే కానీ త‌గ్గ‌కూడ‌దని భార‌త్ గ‌ట్టిగా నిర్ణ‌యించుకుంది. పాంగాంగ్ స‌ర‌స్సు ఉత్త‌ర రేవులోని ఫింగ‌ర్ 4 వ‌ద్ద చైనా భారీగా బ‌ల‌గాలు మొహ‌రించింది. ద‌క్షిణ రేవులోని కీల‌క ప్రాంతాలు భార‌త్ ఆధీనంలో ఉన్నాయి. అయితే ఇక్క‌డ చైనాతో పోల్చితే భార‌త్‌కు వ్యూహాత్మ‌క ఆదిప‌త్యం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఉన్న సాదార‌ణ పరిస్ఙ‌తులు రావాలంటే భారత్ ఇక్క‌డి నుంచి వెన‌క్కు వెళ్లిపోవాలి. అయితే చైనా బ‌ల‌గాల‌ను వెన‌క్కు తీసుకుంటున్న‌ట్లు గ‌ట్టి ఆధారాలు ల‌భిస్తేనే వెన‌క్కు రావాల‌ని భారత్ భావిస్తోంది. మ‌రి చైనా ఏం చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here