నాని నెక్స్ట్ సినిమా పరిశీలనలో ఇద్దరు డైరెక్టర్లు?

టాలీవుడ్ మినిమం గ్యారెంటి హీరో నాచురల్ స్టార్ నాని. ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకెళ్ళిపోతున్న నాని ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరక్షన్ లో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయంలో కనిపిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా చివరి దశలో ఉంది. ఈ సందర్భంగా నాని తర్వాత సినిమా మీద ఆసక్తి నెలకొంది ఇండస్ట్రీలో.

ఈ క్రమంలో నాని తర్వాత చేయబోయే సినిమా ఇద్దరు డైరెక్టర్ల పేర్లు వినబడుతున్నాయి.ఒకరు హను రాఘవపూడి అయితే మరొకరు విక్రమ్ కుమార్. ఈ ఇద్దరు నాని కోసం తమ తమ స్టోరీలను రెడీ చేసుకుంటున్నారట. అయితే ఇద్దరితో సినిమా కన్ఫామ్ కానీ ఎవరితో ముందు చేస్తారనేది ఇంకా డిసైడ్ కాలేదు. అయితే మరోపక్కన నాగార్జున తో చేయబోయే మల్టీస్టారర్ సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here