సన్నీలియోన్ ను పక్కకు నెట్టేసిన ప్రియా ప్రకాశ్ వారియర్

దేశంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ప్రియా ప్రకాశ్ వారియర్ పేరు వినబడుతుంది కనబడుతుంది మొత్తంమీద దేశం అంతా మారుమ్రోగుతుంది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి దేశంలో ఉన్న కుర్రకారు మొత్తం ఫిదా అయిపోయారు.ఈ పరిణామంతో ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తోంది.ఈ సందర్భంగా  ఈ అమ్మడు గూగుల్ సెర్చ్ ఇంజన్ లో పోర్న్ సుందరి సన్నీ లియోన్‌ను కూడా క్రాస్ చేసేసింది.

గత రెండు మూడు రోజులుగా గూగుల్‌లో అత్యధికంగా శోధిస్తున్న పేరు ప్రియా ప్రకాశ్‌దేనట. ఆ రకంగా సన్నీని ఆమె పక్కకునెట్టేసింది. అయితే ఈ మలయాళీ ముద్దుగుమ్మ తాజాగా ‘ఇండియాటుడే’ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ మాట్లాడుతూ…”ఒక్క పాటతో నాకు ఇపుడు దక్కుతున్న ఆదరణ నన్నెంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదు.

నాకు అసలు మాటలు రావడం లేదు. మొత్తానికి నాకు చాలా ఆనందంగా ఉంది”  అని అంది.మొత్తంమీద  తన కొండ బొమ్మలతో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి ఓవర్ నైట్ లో దేశం మొత్తం పాపులర్ అయ్యింది పెద్ద సెలబ్రిటీ అయిపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here