కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ తో భేటీ అయిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ తో ఢిల్లీలో  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల కు అలాగే రాష్ట్రంలో పెండింగ్ లో  ఉన్న అంశాల పై అలాగే కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన ఇవ్వాల్సిన నిధులు విషయమై పలు అంశాలపై చర్చించారు సీఎం కేసీఆర్.అయితే ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఎయిమ్స్ నిర్మాణానికి వెంటనే నిధుల మంజూరుకు చేస్తూ అంగీకారం తెలపడం జరిగింది.

అంతేకాకుండా విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జిల్లాలకు 2017-18సంవత్సరానికి నిధుల మంజూరుకు జైట్లీ హామీ ఇచ్చారు. ఇదిలా వుండగా 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన 1350 కోట్లు సాధించుకుని వచ్చారు కెసిఆర్.అంతే కాకుండా రాష్ట్రంలో పలు అంశాలపై ప్రాజెక్టుల విషయమై చర్చించుకున్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సీఎం కేసీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here