బుల్లెట్ వదిలినా ప్రియ ప్రకాశ్‌ వారియర్‌

ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ తన కనురెప్పలతో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తో దేశం మొత్తాన్ని తన వైపు చూసేలా చేసింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమాకు సంబంధించి వచ్చిన వీడియోలో ఈ మలయాళీ అమ్మడు ఇచ్చిన హావభావాలు దేశంలో ఉన్న కుర్రకారుకి పిచ్చెక్కిచ్చింది.అలాగే సోషల్ మీడియాలో కూడా సంచలనం సృష్టించింది ఈ మలయాళీ నటి ప్రియ ప్రకాశ్‌ వారియర్‌. దీంతో ఈ అమ్మడు పెద్ద సెలబ్రిటీ అయిపోయింది.
ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ కి దక్షిణాది ఇండస్ట్రీలలో నుండి అవకాశాలు వరుసగా వస్తున్నాయి. తెలుగులో కూడా ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ కి అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే ఈ సినిమాకి సంబంధించి మరొక క్లిప్ విడుదల చేశారు.అప్పుడు చూపులతో ఆకట్టుకుంటే ఇప్పుడు అందమైన కిస్ గన్ను అనే తరహాలో హావభావాలను చూపించింది.తాజాగా అమ్మడు వదిలిన బుల్లెట్ చాలామంది కుర్రకారు గుండెలకు తగిలింది. మరి ఈ  వీడియో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here