హీరోగా కాదు నిర్మాతగానే : నాని

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు నాచురల్ స్టార్ నాని. ఓవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటూ మరోవైపు నిర్మాణ రంగంలో అడుగు పెట్టాడు నాని .హీరో నాని కథను ఎంచుకోవడంలో చాలా వైవిధ్యంగా ఆలోచిస్తాడు. ప్రేక్షకులను ఏ విధమైన కథ నచ్చితే బాగుంటుందో ఆ కథను ఎంచుకుని సింపుల్ గా హిట్ కొడతాడు ఈ నాచురల్ స్టార్.అయితే ఈ సందర్భంగా నాని నిర్మించిన ‘అ!’ సినిమా ఈ నెల 16వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ఈ సినిమా ఫైనల్ కట్ చూశానని, దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా బాగా తీశాడని అన్నాడు. సొంత బ్యానర్లో సినిమాలు చేయడం ఇష్టమని తెలిపారు నాని. అయితే హీరోగా కాకుండా కేవలం నిర్మాతగానే సొంత బ్యానర్లో సినిమాలు నిర్మిస్తామని నాని తెలిపారు. ఈ బ్యానర్లో  నేపథ్యం .. అనుభవం వంటి వాటికి కాకుండా, కొత్త దర్శకుల టాలెంట్ కి .. కంటెంట్ కి ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించుకున్నానని అన్నాడు.ఏదిఏమైనా ఇండస్ట్రీలో అవకాశాలు కోసం వె తికేవారికి నాని శుభవార్తే చెప్పాడనుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here