అదే నా ఆఖరి సినిమా : మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైలెంట్ గా హడావిడి లేకుండా బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు పగలగొట్టడం మనం చూశాం. అలాగే  నిజజీవితంలో కూడా మహేష్ బాబు సైలెంట్ గా కనబడిన ఇతరులను ఏడిపించడం లో ఆటపట్టించడం లో మహేష్ చాలా చురుకుగా ఉంటాడట. అలాగే ఆయన సినిమాల్లో సైలెంట్ గా వేసే పంచ్ తెర మీద ఎలా పేలతాయో నిజజీవితంలో కూడా మహేష్ వేసే పంచ్ లు అలా ఉంటాయంటారు మహేష్ సన్నిహితులు. అయితే తాజాగా మహేష్ బాబు అక్క మంజుల దర్శకత్వం వహించిన సినిమా ‘మనసుకు నచ్చింది ‘.

ఈ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బాబు కొడుకు మంజుల ఆంటీ డైరెక్షన్ లో సినిమా ఎప్పుడు చేస్తావని ఆయన కుమారుడు గౌతమ్ అడగ్గా ‘మీ ఆంటీతో చేస్తే అదే నా ఆఖరుసినిమా అవుతుంది’ అని సరదాగా ఒక పంచ్ వేసారట. ఇదే విషయాన్ని మంజులే స్వయంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. భవిష్యత్తులో మాత్రం మహేష్ బాబు మంజుల తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here