చంద్రబాబు కు షాక్ ఇచ్చిన జగన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అలనాడు విభజించినప్పుడు కేంద్రం ఇచ్చిన హామీలలో ముఖ్యమైన హామీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా. అయితే ఈ క్రమంలో విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు వైసిపి అధినేత జగన్ . రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే గాని రాష్ట్రం బాగుపడదు అని గట్టిగా నమ్మే జగన్ తన పార్టీ ఎంపీలతో అనేకసార్లు ఉభయ సభలలో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినా దాఖలాలు ఎన్నో. అయితే తాజాగా జగన్ ఓ సంచలనకరమైన నిర్ణయం తీసుకున్నారు మొత్తం ఆంధ్ర ప్రదేశ్ ఎంపీలు 25 మంది రాజీనామా చేస్తే  కచ్చితంగా కేంద్రం దిగివస్తుందని అన్నారు జగన్.
ఈ సందర్భంగా ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం అందరూ కలిసి పోరాటం చేద్దామంటూ చంద్రబాబుకు పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా కోసం వైసీపీ చేస్తున్న పోరాటంలో కలిసి రావాలంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఎంపీలందరూ ఒక్కమాట మీదుంటే కేంద్రం దిగిరాదా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. జగన్ టీడీపీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో చంద్రబాబునాయుడు అండ్ టీం కు షాక్ ఇచ్చినట్లయింది జగన్. చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కేవలం తన రాజకీయ మనుగడ కోసం మూలన పెట్టేశారు అంటున్నారు విపక్ష పార్టీలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here