‘తుపాకీ’ సీక్వెల్ లో తమన్నా..!

స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్ర, మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘తుపాకీ’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.2012లో వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సొంతం చేసుకుంది.

సుమారు ఎనిమిదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు దర్శకుడు మురుగదాస్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ కి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించనున్నట్లు తెలుస్తోంది. 2010లో వచ్చిన ‘సుర’ చిత్రంలో విజయ్ – తమన్నాలు కలిసి నటించారు. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత ఈ జోడీ మళ్ళీ మ్యాజిక్ రిపీట్ చేయనున్నట్లు సమాచారం.

మరి ఈ వార్తలో  ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. విజయ్​ ప్రస్తుతం ‘మాస్టర్’​ సినిమాలో నటిస్తుండగా..  త‌మ‌న్నా… సంపత్​ నంది, హీరో గోపించంద్‌తో తెరకెక్కిస్తున్న ‘సీటీమార్’​లో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి​గా నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here