తన మనసూ అందమేనని చాటుకున్న నివేథా!

కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రతీ వారం రూ.  కోట్లలో వ్యాపారం జరిగే సినిమా రంగంపై కూడా ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. కేంద్ర ప్రభుత్వం షూటింగ్ లు నిర్వహించుకోవచ్చని సడలింపులు ఇచ్చినా ఇంకా పూర్తి స్థాయిలో సినిమా చిత్రీకరణలు ప్రారంభం కాలేవు. ఇక షూటింగ్ లు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియక అందరూ గందరగోళంలో ఉన్నారు. ఇప్పట్లో సినీ పరిశ్రమ తిరిగి పుంజుకునేలా కనిపించట్లేదు.

అయితే సినిమా పరిశ్రమకు పూర్వ వైభవం రావాలన్నా, ఈ రంగంపై ఆధారపడ్డ వాళ్లకు ఉపాధి లభించాలన్నా మళ్ళీ కొత్త సినిమాల నిర్మాణాలు ప్రారంభం కావాలి. ఈ క్రమంలోనే నటి నివేథా థామస్ తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు అందుతున్నాయి. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇకపై తాను నటించే చిత్రాలకుగాను… ఇప్పటి వరకు తీసుకున్న పారితోషికం కంటే తక్కువ తీసుకుంటానని ప్రకటించింది. కథ నచ్చితే పారితోషికం విషయంలో పట్టింపు లేకుండానే నటిస్తానంటూ నిర్మాతలకు హామీ ఇచ్చింది.

నిర్మాతలకు సపోర్ట్ చేసే ఉద్దేశ్యంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పింది. కరోనాలాంటి సంక్షోభ సమయంలో చిత్ర పరిశ్రమ కోసం నివేథా తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందించదగినదనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. జెంటిల్ మెన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార నివేథా థామస్ అనంతరం టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ కనిపించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here