అవును… మేమిద్దరం విడిపోయాం!

మరో సెలెబ్రెటీ జంట విడాకులు తీసుకుంది. గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన హీరోయిన్ ఎస్తేర్, గాయకుడు నోయల్ జంట తాజాగా విడాకులు తీసుకొని తమ వివాహ బంధానికి ముగింపు పలికింది. ఈ విషయాన్ని ఎస్తేర్ అధికారికంగా ప్రకటించింది.

గతేడాది జనవరి 3న వివాహం చేసుకున్న ఈ జంట కొన్ని రోజులు కూడా కాపురం చేయలేదట. పెళ్లయిన మరుసటి రోజు నుంచే తామిద్దరి మధ్య సర్దుబాటు సమస్యలు తలెత్తాయని, అలా కొన్ని రోజులకే విడిపోయామని ఎస్తేర్ సంచలన ప్రకటన చేసింది.

గతేడాది జూన్ లో ఇద్దరి ఒప్పందం మేరకు విడాకులకు అప్లై చేశామని, మేము విడిపోయామనే విషయంపై సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నప్పటికీ.. అధికారికంగా చెప్పాలనే ఉద్దేశంతో తాను ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని ఎస్తేర్ చెప్పుకొచ్చింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here